Big Boss 7: బిగ్ బాస్ 7లో కొత్త రూల్స్..బ్రేక్ చేశారో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఏడవ సీజన్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాలకృష్ణను హోస్టుగా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేయను అని మొహం మీదే చెప్పేసారట. దాంతో నాగార్జుననే ఈ షో కి దిక్కుగా మారిపోయారు. రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన ప్రోమో షూట్ ని కూడా పూర్తి చేయడం జరిగింది.. ఇటీవలే ప్రోమోను కూడా విడుదల చేశారు..
ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు రాగా ఏది కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో చాలా కఠినమైన రూల్స్ ని బిగ్ బాస్ లో పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కూడా ఉన్నాయి.. హౌస్ లో కంటెంట్స్ కొన్ని సందర్భాలలో మితిమీరి హద్దులు దాటి గొడవలు పెట్టేసుకుంటున్నారు. అలా గొడవలు పెట్టుకుని పొరపాటున నోటి నుండి ఒక బ్యాడ్ పదం కూడా బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
ఇక టాస్క్ లు, గేమ్స్ కూడా చాలా కొత్తగా ఆదించునున్నారని టాక్.. అంతేకాకుండా సిరి – షణ్ముఖ్ మధ్య సీజన్ ఫైవ్ లో రొమాన్స్ చూసి ప్రేక్షకులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. అందుకే ఇలాంటి రొమాన్స్ కి తావు ఇవ్వకుండా చూసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు అని సమాచారం.. గతంలో అనేక తప్పులు జరిగాయి.. అలాంటి తప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా చూసేందుకు యాజమాన్యం అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.. అందరికి తెలిసిన వాళ్ళే హౌస్ లోకి రానున్నారని సమాచారం.. ఈ షోకు ప్రారంభానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆగస్టు మొదటి వారంలో ఈ షోను నిర్వహించనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఆ సీజన్ లో ఎవరు వస్తారోనని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!