ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టా అంతా తీస్తున్నాం..టిఆర్ఎస్ పతనం మొదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రేపు ఎవరికైనా జరిగేది ఇదే మేం గతంలో చెప్పారు ఇప్పుడు కూడా చెబుతున్నామన్నారు. ఇవాళ ఉద్యమకారులకు రక్షణ కల్పించే పార్టీ బిజేపి అని.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎదురుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బిజేపి అని తెలిపారు.
ఉద్యమకారులకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ఒక వేదిక కాబోతోందన్నారు. ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న వారిని దగ్గర ఉంచుకున్నాడని.. టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టా అంతా తీస్తున్నామని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఆరోపించే పార్టీ బిజెపి కాదని..తేనె తుట్టెను ముఖ్యమంత్రి కెసిఆర్ కుదిపించాడని.. టిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభం అయిందని హెచ్చరించారు. డబ్బులు, అడ్డదారులలో గెలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడని మండిపడ్డారు.
Also Read
- Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
- CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
- Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
- IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!