NTV Telugu Site icon

Bihar: ఇదెక్కడి మాస్ రా మావా! మేనకోడలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్త..

Bihar

Bihar

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల పెళ్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోపాల్‌గంజ్‌లో ఓ అత్త తన మేనకోడలిపై ప్రేమతో భర్తను వదిలేసింది. తర్వాత పారిపోయి తన మేనకోడలిని పెళ్లి చేసుకుంది. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వీరిద్దరి మధ్య మూడేళ్లుగా ప్రేమాయణం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటన కుచాయికోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామానికి సంబంధించినది.

READ MORE: Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం

బెల్వా నివాసి అయిన అత్త, ఆమె మేనకోడలు వారి బంధువులందరినీ కాదని ససముసాలోని దుర్గా భవానీ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆలయంలో వివాహ సమయంలో అన్ని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు. ఇక్కడ అత్త మెడలో కోడలు తాళి కట్టడం విశేషం. మెడలో మంగళసూత్రం కూడా కట్టింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. ఏడు జన్మలు ఒకరితో ఒకరు కలిసుంటామని వాగ్దానం కూడా చేశారు. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతో మేన కోడలు ఇంటి నుంచి పారిపోయింది. మేనకోడలు శోభ చాలా అందంగా ఉందని.. మరెవరినైనా పెళ్లి చేసుకుంటే నన్ను వదిలేస్తుందేమోనని భయపడ్డట్లు అత్త పేర్కొంది. చనిపోయే వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేశారు. వీరిద్దరి పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అత్త, మేనకోడలి ఈ అపూర్వ వివాహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Show comments