తెలుగులో మన బడాస్టార్స్ తో నటించటానికి హీరోయిన్ల కొరత బాగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కి హీరోయిన్స్ సెట్ చేయాలంటే దర్శకనిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. నిన్న మొన్నటి వరకూ కాజల్ వారికి ఓ ఆప్షన్ గా ఉండేది. అయితే పెళ్ళయి బిడ్డకు తల్లి కాబోతున్న కాజల్ అందుబాటులో లేక పోవడంతో డిమాండ్ మరింత పెరిగింది. అది కొంత మంది తారలు పారితోషికాలు పెంచటానికి కూడా కారణం అవుతోంది. నిజానికి నాగార్జున హీరోగా రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో ముందు కాజల్ నే హీరోయిన్ అనుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. అయితే గర్భవతి కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో అది అమలాపాల్ కి వరంగా మారింది.
Read also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ ఉందట. అందులో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడి ఓ హిల్ స్టేషన్‌లో గడిపే సీక్వెన్స్ ఉన్నాయట. ఆ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ ఫిలిం సిటీలో ఇండోర్ లో షూటింగ్ జరుగుతోందట. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆ పాటలో గ్లామర్ మోతాదు ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాడట. అందులో భాగంగా లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయట. అయితే అమలాపాల్ ముద్దు, సన్నిహిత సన్నివేశాలు చేయడానికి ఎక్కువ డబ్బు డిమాండ్ చేసిందట. తప్పని పరిస్థితుల్లో దర్శకనిర్మాతలు అమ్మడు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కి ఒప్పుకుని షూటింగ్ పూర్తి చేశారట. మరో నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ను నిరవధింగా జరపటంతో మొత్తం పూర్తవుంటుందంటున్నారు. మరి ‘ఘోస్ట్’లో అమలాపాల్ లిప్ లాక్ సీన్ ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.