Site icon NTV Telugu

Airtel Unlimited Plans 2026: ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్‌.. రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా!

Airtel Unlimited Plans

Airtel Unlimited Plans

ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్‌టెల్’ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఓ శుభవార్త. తాజాగా ఎయిర్‌టెల్ రెండు కొత్త ఫుల్లీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. రూ.399, రూ.449 ధరలతో వచ్చిన ఈ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్‌ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

రూ.399, రూ.449 ప్లాన్‌లలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 4G/5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. హైస్పీడ్ డేటా అవసరం ఉన్నవారు, రోజువారీ కాలింగ్ ఎక్కువగా చేసే వారికి ఈ ప్లాన్‌లు మంచి ఎంపిక అనే చెప్పాలి. ముఖ్యంగా 5G సపోర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్‌లు మరింత ఉపయోగకరంగా ఉండనున్నాయి.

Aslo Read: Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్‌ షేకే ఇగ!

రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అదనంగా ఆకర్షణీయమైన ఓటీటీ ప్రయోజనాలు కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌తో పాటు సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ లభించనుంది. అలాగే 30GB గూగుల్ వన్ స్టోరేజ్, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి అదనపు డిజిటల్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. రూ.399, రూ.449 ప్లాన్‌లు ప్రస్తుతం సెలెక్టెడ్ సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version