Site icon NTV Telugu

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో అడవి శేష్

Adivi Sesh has been infected with Dengue and hospitalized on 18th Sep

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత వారం అడివి శేష్‌కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయట. దీంతో అడివి శేష్ సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు, ఆయన అభిమానులు శేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ

ప్రస్తుతం ఈ యంగ్ హీరో “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘మేజర్’లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది.

Exit mobile version