Site icon NTV Telugu

ప్రభాస్ వర్సెస్ అక్షయ్ కుమార్

Adipurush vs Rakshabandhan

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఢీకొట్టబోతున్నాడు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నారు.

Read Also : మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అనుకుంటున్నారు… కానీ…!

బాలీవుడ్ కి గుండె వంటి మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటి వరకూ పెండింగ్ లోఉన్న ప్రాజెక్టుల విడుదల తేదీలను దర్శకనిర్మాతలు ఖరారు చేస్తున్నారు. అందుల భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రక్షాబంధన్’ సినిమాను ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అక్షయ్, భూమి పడ్నేకర్ తో జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీనికి రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక ధిల్లాన్ రచయిత కావటం విశేషం. ఇక ప్రభాస్ ‘ఆదిపురుష్‌’లో కృతి సనన్, సైఫ్‌ అలీఖాన్, సన్నీసింగ్ ముఖ్య పాత్రధారులు. మరి బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్న ప్రభాస్, అక్షయ్ లో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో చూడాలి.

Exit mobile version