యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ ఇతిహాసం కథకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. 2022 ఆగష్టు 08న సినిమా విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల కానుంది అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Read Also : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయించుకున్నారట. సినిమా 3డిలో విడుదల కానుంది. కాబట్టి షూటింగ్ కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట. ఈ సన్నివేశాలను ప్రభాస్ డూప్ లేకుండా చేయనున్నారట. దాని కోసం స్టంట్స్ రిహార్సల్స్ చేయడం కూడా మొదలు పెట్టాడట.
