‘రుద్రుడి’తో రాశీ ఖన్నా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోలకు కొంత వరకూ ఓటీటీలపై చిన్న చూపు ఉందేమోగానీ… బాలీవుడ్ లో సీజన్ మారిపోయింది. వరుస లాక్ డౌన్ లు, థియేటర్ల మూసివేతతో డిజిటల్ స్ట్రీమింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు బీ-టౌన్ స్టార్స్. ఇప్పటికే కొందరు క్రేజ్, సీనియారిటీ ఉన్న హీరోలు వెబ్ సిరీస్ లతో సత్తా చాటగా తాజాగా అజయ్ దేవగణ్ డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు.
‘రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ పేరుతో డిస్నీ హాటస్టార్ వీఐపీ ప్లాట్ ఫామ్ పై అజయ్ తొలి వెబ్ సిరీస్ విడుదల కానుంది. అయితే, జూలై 21న బీబీసీ స్టూడియోస్ వారి ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటూ ముంబైలోని చాలా ఐకానిక్ లొకేషన్స్ లో చీత్రకరణ జరుపుతారు. ఇంకో విశేషం ఏంటంటే… ‘రుద్ర’ వెబ్ సిరీస్ లో మన టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఫీమేల్ లీడ్ గా నటించనుంది. ఆమె ఇప్పటికే ‘ద ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే నెక్ట్స్ రూపొందించబోతోన్న సిరీస్ లో నటిస్తోంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాశీ ఖన్నా సెకండ్ ఓటీటీ ప్రాజెక్ట్ గా ‘రుద్ర’ నిలవనుంది.
‘రుద్ర’ వెబ్ సిరీస్ బీబీసి వారి సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ ‘లూథర్’కి అఫీషియల్ రీమేక్. ఇండియాలో బీబీసీ స్టూడియోస్ తో కలసి అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ‘రుద్ర’… ఓ పోలీస్ డిటెక్టివ్ కథ. అతను ఒక సైకోపాత్ అండ్ మర్డర్ తో అనుకోని పరిస్థితుల్లో స్నేహం చేస్తాడు. వారిద్దరూ పలు కేసుల్ని ఆసక్తిర పరిణామాల నడుమ పరిష్కారిస్తారు.
Also Read
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- Tags
- Ajay Devgn
- Raashi Khanna
- Rudra
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!