NTV Telugu Site icon

Delhi Metro : ఛీ.. ఛీ.. మెట్రోలో అలాంటి పనిచేస్తూ కెమెరాలకు చిక్కిన జంట.. వీడియో వైరల్..

Metroo

Metroo

సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి జనాలు పాపులర్ అవ్వాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరోవైపు నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులను పబ్లిక్ లోనే చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు.. అయిన కొందరి బుద్ది మారలేదు.. వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట సన్నిహితంగా మెలగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు.. వారు చేస్తున్న వింత పనికి సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువ జంట ట్రైన్ ఎక్కింది… అందులో అమ్మాయి సీట్ పై కూర్చుంది. అబ్బాయ్ మెకాళ్లపై కూర్చున్నాడు. కోక్ మూత తీసి అతను అమ్మాయి నోట్లో కూల్ డ్రింక్ పోశాడు. ఆ తర్వాత అమ్మాయి ఆ కూల్ డ్రింక్ ను అబ్బాయి నోట్లోకి ఉంచింది. ఆ తర్వాత అబ్బాయి కూడా అమ్మాయి నోట్లోకి ఉంచాడు. అమ్మాయి మళ్లీ అబ్బాయి నోట్లోకి కూల్ డ్రింక్ ను ఊసింది.. ఆ అబ్బాయి మాత్రం దాన్ని ఏదో అమృతంగా తాగేసాడు..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. నోటికి పని పెట్టారు. ఘాటు మాటలతో కామెంట్స్ చేస్తూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.. ఇకపోతే ఢిల్లీ మెట్రో వివాస్పదమైన రీల్స్ ఇది మొదటిసారి కాదు.. గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే చర్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇదివరకే నిషేధించింది. ఇలాంటి చర్యలు మళ్లీ మళ్లీ జరగకుండా అనేక చర్యలు చేపట్టింది. అయినా ఢిల్లీ మెట్రోలో రీల్స్ పిచ్చి ఆగడం లేదు.. పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..