NTV Telugu Site icon

Bangalore KGF: కేజీఎఫ్‌లో కేవలం 5 సెకన్లకే కుప్పకులిన భవనం (వీడియో)

Kgf News

Kgf News

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో ఒక భవనం కూలినట్లు చూడొచ్చు. బెంగళూరులోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో కొన్ని సెకన్ల వ్యవధిలో భవనం నేలమట్టమైంది. స్థానికుల కథనం ప్రకారం.. భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా భవనంలో భారీ పగుళ్లు పడ్డాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం కూలిపోకముందే అందులోని ప్రజలను సురక్షితంగా తరలించారు. దీని కారణంగా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది ధ్రువీకరించలేదు.

READ MORE: Bengal doctor: హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి..

ఈ వీడియోను షేర్ చేసిన సోషల్ మీడియా వినియోగదారు క్యాప్షన్‌లో రాశారు. ” బెంగళూరులోని కేజీఎఫ్‌ (కోలార్ గోల్డ్ ఫీల్డ్) బంగారుపేటలో ఒక పెద్ద భవనం కూలిపోయింది. ఈ భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా భవనంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. భవనం కూలిపోకముందే అందరినీ ఖాళీ చేయించారు. దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.” అని రాసుకొచ్చారు.

READ MORE:Kiran Abbavaram : హీరోను మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు.. ఒక్క శుక్రవారం చాలు !

అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌ను ఎక్స్‌ హ్యాండిల్ @karnatakaportf పోస్ట్ చేశారు. ఈ 12 సెకన్ల వీడియోలో, భవనం ఒక్కసారిగా కుప్పకూలడం, నేలపై పడి ముక్కలుగా విడిపోవడం చూడవచ్చు. ఈ వీడియోను బాగా గమనిస్తే.. భవనం కూలడానికి కేవలం 5 సెకన్లు మాత్రమే పట్టడం గుర్తించవచ్చు. అయితే.. అక్కడున్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీశారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సహకరించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.