NTV Telugu Site icon

2వేల ఏళ్ల క్రిత‌మే అందుబాటులో అత్యాధునిక వైద్యం… ఇదే సాక్ష్యం…

ప్ర‌స్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నది.  ఎలాంటి జ‌బ్బుల‌ను న‌యం చేయ‌డానికైనా మందులు అందుబాటులో ఉన్నాయి.  పూర్వం రోజుల్లో ఇంత‌టి వైద్యం అందుబాటులో లేదు.  ర‌వాణా సౌక‌ర్యాలు అంతంత మాత్ర‌మే.  తీవ్ర‌మైన జ‌బ్బులు వ‌స్తే నాటు వైద్యం చేసేవారు.  లేదా ఆ జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతూ మ‌ర‌ణించేవారు.  ఇక వేల సంవ‌త్స‌రాల క్రితం వైద్యం ఎలా ఉంటుంది… అస‌లు వైద్యం గురించి అప్ప‌ట్లో ప్ర‌జ‌ల‌కు తెలుసా లేదా అంటే, 2 వేల ఏళ్ల క్రిత‌మే అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంద‌ని అంటున్నారు పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు.  2వేల ఏళ్ల‌నాటి పెరువియ‌న్ యోథుడి పుర్రెను ఇటీవ‌లే శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.  ఈ పుర్రె యూఎస్‌లోని మ్యూజియంలో ఉంచారు.  

Read: బ్రాండ్ నేమ్ వాడొద్దు…. తెలంగాణ వైద్యులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఆ పుర్రెకు ఒక ప‌క్క చిన్న ఐర‌న్ ప్లేట్ వేసి ఉంది.  పుర్రెకు గాయం కావ‌డంతో ఆప‌రేష‌న్ నిర్వ‌హించి పుర్రెకు ఐర‌న్ ప్లేట్‌ను అమ‌ర్చి ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు.  అయితే, పుర్రెకు ఆప‌రేష‌న్ చేసిన త‌రువాత ఆ మ‌నిషి కోలుకొని బ‌తికార‌ని పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.  పురాత‌న కాలంలో అత్యాధునిక వైద్య శ‌స్త్ర‌చికిత్స‌లు అందుబాటులో ఉన్నాయ‌ని, దీనికి ఉదాహ‌ర‌ణ ఈ పెరువియ‌న్ యోధుడి పుర్రె అని చెప్పుకొచ్చారు.