దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. దక్షిణ కొరియాలోని సబ్‌వేలో పనిచేస్తున్న ట్రైన్ ఆపరేటర్ కొద్దిసేపు విరామం తీసుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ విరామం కారణంగా 125 రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. కండక్టర్ కొన్ని నిమిషాలు మాత్రమే విరామం తీసుకున్నాడు. కానీ.. ఈ టాయిలెట్ బ్రేక్ ప్రయాణీకులకు ఖరీదైనదిగా మారింది.
READ MORE: Maharashtra CM Post: సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ హైరానా! కారణమిదేనా?
కొరియన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కనీసం 125 రైళ్లు రైలు ఆపరేటర్ నాలుగు నిమిషాల టాయిలెట్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆలస్యంగా నడిచాయి. వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు సియోల్‌లోని లైన్ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔటర్ లూప్‌పై నడుస్తున్న రైలు అకస్మాత్తుగా స్టేషన్‌లో ఆగిపోయింది. ఆపరేటర్ కు టాయిలెట్ వచ్చింది. దీంతో అతడు ప్లాట్‌ఫారమ్‌పైకి పరిగెత్తాడు. టాయిలెట్ రెండవ అంతస్తులో ఉన్నందున.. రైలు ఆపరేటర్ తన క్యాబిన్‌కు తిరిగి రావడానికి 4 నిమిషాల 16 సెకన్లు పట్టింది.
READ MORE:Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
దీని వల్ల డొమినో ప్రభావం ఏర్పడింది. సియోల్ మెట్రో ప్రకారం.. ఈ రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఇదే సర్క్యులర్ లైన్‌లో నడుస్తున్న మరో 125 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇందులో కొన్ని రైళ్లు 20 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. కాగా.. దక్షిణ కొరియాలో రైళ్ల రాకపోకల షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. కండక్టర్లు విరామం లేకుండా రెండు మూడు గంటలు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు అత్యవసర అవసరాలు తలెత్తినప్పుడు.. వారికి కష్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పోర్టబుల్ టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. ఈసారి మాత్రం ఆపరేటర్ స్టేషన్‌లోని టాయిలెట్‌ను ఎంచుకున్నాడు. దీంతో ఈ ఘటన జరిగింది. ఆలస్యానికి సియోల్ మెట్రో.. ప్రయాణికులకు విచారం వ్యక్తం చేసింది. అయితే రైళ్ల రాకపోకలకు పెద్దగా జాప్యం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.