మొబైల్ ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే అత్యవసరంగా వినియోగించుకునేందుకు పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తుంటారు. పవర్‌బ్యాంక్‌లను ఒకసారి ఛార్జింగ్ చేసి దానిని మొబైల్‌కు కనెక్ట్ చేస్తే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత కొంతకాలంగా పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లతో పాటుగా, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగింది.
Read: శతాబ్దం చివరినాటికి… భూవినాశనం తప్పదా…
పెట్రోల్, డీజిల్ బంకులు ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి కాబట్టి సమస్యలేదు. కాని, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు సంఖ్య చాలా తక్కువగా ఉంది. మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయి వాహనం ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రిటన్ కు చెందిన జిప్ చార్జింగ్ అనే స్టార్టప్ కంపెనీ ముందుకు వచ్చింది. గో పేరుతో పవర్ బ్యాంక్‌ను తయారు చేసింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో విపణిలోకి ప్రవేశపెట్టబోతున్నారు. 20 కేజీల బరువుండే ఈ పవర్ బ్యాంక్‌ను ఈజీగా ట్రావెల్ చేసే విధంగా తయారు చేసింది జిప్ చార్జింగ్ సంస్థ.
