రూపాయికి ఏమోస్తుంది అంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమే. కానీ, ఆ గ్రామంలో రూపాయికి ఏమోస్తుంది అంటే ఇడ్లీ వస్తుందని చెబుతారు. గత 16 ఏళ్లుగా రూపాయికే ఇడ్లీని, బజ్జీలను అందిస్తున్నది ఆ కుటుంబం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మిగతా హోటళ్ల నుంచి ఒత్తిడి వచ్చినా ధరలను మార్చలేదని ఆ హోటల్ యజమాని చెబుతున్నారు. రూపాయికి ఇడ్లీతో పాటుగా మూడు రకాల చెట్నీలు కూడా అందింస్తున్నారు. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుందని అనుకుంటున్నారా… ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపుపరం మండలం పరిధిలోని ఆర్.బీ కొత్తూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాంబాబు అనే వ్యక్తి తన ఇంట్లో గత 16 ఏళ్లుగా హోటల్‌ను నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీని అందిస్తున్నారట. నిత్యవసర ధరలు పెరిగినప్పటికీ ఇడ్లీలను అంతకంటే ఎక్కువ ధరలకు అమ్మడం లేదని, నష్టం రానంత వరకు హోటల్‌ను నిర్వహిస్తామని అంటున్నారు. రూపాయికి ఇడ్లీ లేదా బజ్జీ ఇస్తామని, అలానే, రుచికరమైన చెట్నీలు మూడు ఇస్తామని చెబుతున్నారు. ప్రతిరోజు 500 మంది కస్టమర్లు వస్తుంటారని రాంబాబు చెబుతున్నాడు. ఇతర హోటళ్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ రూపాయికి మించి అమ్మడం లేదని ఆయన చెబుతున్నారు.
Read: శ్రీలంకలో దారుణం…ఒకవైపు కరోనా… మరోవైపు ఫుడ్ ఎమర్జెన్సీ…