బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బద్వేల్‌లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నారు. లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతను, కౌంటింగ్ కేంద్రాల వద్ధ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తాజా సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉన్నది.
Read: లైవ్ అప్డేట్స్: హుజురాబాద్, బద్వేల్ ఎన్నికల ఫలితాలు
ఇక ఇదిలా ఉంటే, అటు హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 753 ఓట్లు పోలవ్వగా అందులో 509 ఓట్లు టీఆర్ఎస్ సాధించగా, బీజేపీకి 159 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 32 ఓట్లు సాధించింది.