తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం ఇంకా ముదిరి పాకానికి చేరింది.
read also : నిజాలు మాట్లాడితే ఏపీ నేతలకు ఉలికి పాటు ఎందుకు ? : తెలంగాణ మంత్రి
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ చెల్లెలు అయిన.. వైఎస్ షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నీటి వివాదంపై స్పందించారు. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని ఆమె పేర్కొన్నారు. అందుకు అవసరం అయితే ఎవరితో అయినా పోరాడటానికైనా సిద్ధమన్నారు షర్మిల. ‘ తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.” అంటూ షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిల స్పందనతో ఈ వివాదం మరింత వేడేక్కింది. ఇక షర్మిల ఒపీనియన్ పై ఏపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
