NTV Telugu Site icon

పట్టపగలే బైక్ విన్యాసాలు.. జుట్టుపీక్కుంటున్న పోలీసులు

హైదరాబాద్‌లో యువత స్పీడ్‌కి బ్రేకులే లేవు. కాస్త ఖాళీ దొరికిందంటే చాలు వివిధ రకాల బైక్‌లతో రోడ్లమీదకు వచ్చేస్తారు యువత. తాజాగా హైదరాబాద్‌లో యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేశారు. హైదరాబాద్లో పట్టపగలే పోకిరీల విన్యాసాలు కలకలం రేపాయి. రద్దీ ఉన్న ఏరియాలో బైక్ విన్యాసాలు చేస్తున్నారు పోకిరీలు.

సెలవు దినం కావడంతో ఆదివారం హైదరాబాద్‌ రోడ్లపై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు కుర్రకారు. మలక్ పేట ప్రాంతంలో బైక్ విన్యాసాలు చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు యువకులు. బైక్ విన్యాసాలు చేస్తున్న పోకిరీలను పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనం.

అయితే పోలీసులు మాత్రం వీరిని ఎలా పట్టుకోవాలో అర్థంకావడం లేదంటున్నారు. ఎందుకంటే బైక్ లపై నెంబర్ ప్లేట్లు లేకపోవడంతో వారిని ఎలా పట్టుకోవాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నారు పోలీసులు. సీసీ కెమేరాల ఆధారంగా వీరిని పట్టుకోవాలని స్థానికులు పోలీసులకు సూచిస్తున్నారు.