NTV Telugu Site icon

వైర‌ల్‌: పెట్రోల్ లేకుండానే ప‌రుగులు తీస్తున్న బైక్‌…

దేశంలో పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిపోతున్నాయి.  ఇప్ప‌టికే  లీట‌ర్ పెట్రోల్ వంద దాటిపోయింది.  రాబోయే రోజుల్లో ఈ ధ‌ర 150కి చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రంలేదు.  పెట్రోల్ ధ‌ర‌లు భ‌రాయించ‌లేనివారు ప్రత్యామ్నాయ మార్గాలైన ప‌బ్లిక్ స‌ర్వీసుల్లో ప్ర‌యాణాలు చేస్తుండ‌గా, కొంత‌మంది ఎల‌క్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. యువ‌త‌కు బైక్‌లంటే ఎంత‌టి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోవ‌డంతో యువ‌త కొత్త‌గా ఆలోచించి నూతనంగా బండ్ల‌ను త‌యారు చేసుకుంటున్నారు.

Read: పాక్ లో 5వేల ఇండియా ట్ర‌క్కులు… అనుమ‌తి ప‌డిగాపులు…

పెట్రోల్‌, డీజిల్‌, ఎల‌క్ట్రిక్ అవ‌స‌రం లేకుండానే బైక్‌లు రోడ్డుపై న‌డిచే విధంగా చేస్తున్నారు.  ఇలాంటి బైక్ ల‌ను ఇండియన్ జుగాడీ పేరుతో ట్రెండ్ అవుతున్నాయి.  సైకిల్‌కు బైక్ డోమ్‌ను అమ‌ర్చి బైక్ న‌డిపిన ఫీలింగ్‌లో రోడ్ల‌పై ర‌య్‌మంటూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ కావ‌డంతో వైర‌ల్ అయింది.  సైకిల్ తొక్క‌డం ఇష్టంలేని వ్య‌క్తులు కూడా ఇలాంటి బైక్‌లను చూస్తే త‌ప్ప‌క తొక్కుతారు అన‌డంలో స‌మ‌స్య‌లేదు.  

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి