NTV Telugu Site icon

వైర‌ల్‌: పాముతో యువ‌తి ముద్దులు… షాకైన నెటిజన్లు…

సాధార‌ణంగా పాములు చూస్తే ఎవ‌రికైనా భ‌య‌మే.  పాము అంటే విష జంతువు అనే అనుకుంటాం.  మ‌న మైండ్‌లో అలానే ఉండిపోతుంది.  అయితే, పామును చూడ‌గానే దాన్ని చంపేస్తాం లేదంటే స్నేక్ క్యాచ‌ర్స్‌ను పిలిపించి దాన్ని అప్ప‌గిస్తాం.  అయితే, కొన్ని పాముల‌ను జాగ్ర‌త్త‌గా పెంచుకుంటే అవి స్నేహితుల్లా మారిపోతాయి.  దానికి ఓ ఉదాహ‌ర‌ణ ఈ వీడియో.  ఓ యువ‌తి త‌న మెడ‌లో కొండ‌చిలువ‌ను ఉంచుకొని దాని త‌ల ముందు భాగంలో ముద్దుపెట్టింది.  ఆ ముద్దుకు ప‌ర‌వ‌సించిపోయిన ఆ కొండ‌చిలువ నోరు తెరిచి త‌న్మ‌య‌త్వంలో మునిగిపోయింది.  మ‌ర‌లా మ‌ర‌లా కొండ‌చిలువ త‌ల ముందు భాగంలో ముద్దుపెడుతూ దానిని లాలించింది.  దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియ‌లో పోస్ట్ కాగా ఒక్క‌సారిగా వైర‌ల్ అయింది.  బాబోయ్ ఈమె ఎవ‌ర్రాబాబు… కొండ చిలువ‌తోనే ప‌రాచ‌కాలాడుతోంద‌ని నెటిజ‌న్లు వాపోతున్నారు.  పాముకు పాలుపోసి పెంచితే ఏమౌతుందో తెలిసి కూడా యువ‌తి ఇలా చేస్తోంద‌ని కొంత‌మంది నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.  

Read: సొంత ఎయిర్ ఫోర్స్ దిశ‌గా తాలిబ‌న్ అడుగులు…