NTV Telugu Site icon

Karnataka polls: యడియూరప్ప ఒత్తిడిలో మాట్లాడుతున్నారు.. మాజీ సీఎంపై షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్య

Yedurappa Vs Jagadish

Yedurappa Vs Jagadish

రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని పిలుపునిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బిఎస్ యడియూరప్పపై జగదీష్ షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఒత్తిడి మేరకు యడియూరప్ప ఈ మాటలు చెబుతున్నారని షెట్టర్ అన్నారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుండి జగదీష్ షెట్టర్ గెలవకుండా ఉండటానికి బిజెపి నాయకులందరూ చాలా కష్టపడతారని యడియూరప్ప చెప్పగా, బిజెపి తన కుమారుడు విజయేంద్రకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే యడియూరప్ప అలాంటి ప్రకటన చేసి ఉండేవారు కాదని శెట్టర్ పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా యడియూరప్పను కలిశానని, తనకు టిక్కెట్ ఇవ్వాలని, లేకపోతే ఉత్తర కర్ణాటకలో పార్టీ 20-25 సీట్లు కోల్పోతుందని పార్టీ హైకమాండ్‌ను చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఒత్తిడి వల్లే ఆయన మాట్లాడుతున్నారని షెట్టర్ అన్నారు.
Also Read:Heavy Rain Hits Hyderabad Live: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం

హుబ్లీలో విలేకరులతో యడియూరప్ప మాట్లాడుతూ.. ”ఈ ఎన్నికల్లో మా ప్రజలకు షెట్టర్‌ను గెలిపించకూడదని.. మా అభ్యర్థిని గెలిపించాలని నేను చెప్పాను. ఇక్కడ భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తాం. షెట్టర్ గెలవకుండా ఉండేందుకు మేం చాలా కష్టపడతాం.ఈ నియోజకవర్గంలో షెట్టర్ గెలవకుండా చూస్తామని మా నాయకులందరూ ప్రమాణం చేశారు” అని చెప్పారు. జగదీష్ శెట్టర్ సొంత నియోజకవర్గం అయిన హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగింకైని పోటీకి దింపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నుంచి బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను బీజేపీ పోటీకి దింపింది. దశాబ్దాలుగా తన తండ్రికి పట్టున్న నియోజకవర్గం నుంచి విజయేంద్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

బీజేపీ టికెట్ ఆశించిన జగదీశ్‌ షెట్టర్‌కు పార్టీ నాయకత్వం పోటీ చేసే అవకాశం కల్పించలేదు. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ కోసం అభ్యర్థించారు. అయితే, బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో షెట్టర్ అవమానంగా భావించారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అంతే కాదు పార్టీ తరుపున ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. షెట్టర్ పార్టీ మారడంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read:Yogi Death Threat: ప్రియురాలి తండ్రి ఫోన్‌తో కుట్ర.. యోగిని చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్

Show comments