NTV Telugu Site icon

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో భర్తీ కానున్న 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇదే ఆఖరు కాదని, ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన వారికి తర్వాత అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

విజయనగరం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇందుకూరి రఘురాజు (క్షత్రియ సామాజిక వర్గం), విశాఖపట్నం రెండుస్థానాలు ఉండగా వంశీకృష్ణ యాదవ్ (బీసీ-యాదవ), వరుదు కళ్యాణి (కప్పుల వెలమ బీసీ), తూర్పుగోదావరి లోకల్ కోటాలోఅనంతబాబు (ఓసీ కాపు), కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం (ఓసీ కమ్మ), మొండితోక అరుణ్ కుమార్(ఎస్సీ, మాదిగ), గుంటూరు జిల్లా నుంచి ఎమ్.హనుమంతరావు (చేనేత, బీసీ), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(కాపు), ప్రకాశం జిల్లా నుంచి టి. మాధవ రావు (ఓసీ, కమ్మ), చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇంఛార్జ్ (భరత్-బీసీ), అనంతపురం నుంచి వై. శివరామి రెడ్డి లను ఎంపిక చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.