NTV Telugu Site icon

ఒలింపిక్స్‌.. సెమీస్‌లో అడుగుపెట్టిన భజ్‌రంగ్‌

Bajrang Punia

Bajrang Punia

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.. రెజ్లింగ్‌ 65 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో విజయం సాధించారు.. క్వార్టర్‌ ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు.. కేవలం 4:46 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించాడు భజరంగ్‌ పునియా.. ఇక సెమీ ఫైనల్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన అలియెవ్‌ హజీతో తలపడనున్నాడు భజరంగ్‌ పునియా.. సెమీస్ విజయం సాధిస్తే ఏదో ఒక మెడ‌ల్ ఖాయంగా భారత్‌కు అందించనున్నాడు భజరంగ్‌.. లేదంటే బ్రాంజ్ మెడ‌ల్ కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కాగా, ప్రి క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో భ‌జ‌రంగ్ పూనియా.. కిర్గిస్తాన్‌కు చెందిన బ‌ల‌మైన ప్రత్యర్థి ఎర్నజ‌ర్ అక్మత‌లేవ్‌పై విజ‌యం సాధించాడు. ర‌స‌వ‌త్తరంగా సాగిన బౌట్‌లో పూనియా పాయింట్ల ఆధారంగా గెలుపొందాడు. నిజానికి ఇద్దరూ 3-3 స్కోర్ చేసినా.. తొలి పీరియ‌డ్‌లో టేక్‌డౌన్ వ‌ల్ల భజ‌రంగ్‌కు విజ‌యం ద‌క్కింది. ఫ‌స్ట్ పీరియ‌డ్‌లో భ‌జ‌రంగ్ పూనియా మూడు పాయింట్లు సాధించాడు. అయితే కిర్గిస్తాన్‌ ప్లేయ‌ర్ ఫ‌స్ట్‌ క్వార్టర్‌లో ఒక పాయింట్‌, సెకండ్ పీరియ‌డ్‌లో రెండు పాయింట్లు సాధించి స‌మంగా నిలిచాడు. కానీ విక్టరీ బై పాయింట్స్ ఆధారంగా .. భ‌జ‌రంగ్ పూనియాను విజేత‌గా ప్రక‌టించారు.