NTV Telugu Site icon

Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

Illusion Biryani

Illusion Biryani

వంటకాల్లో బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. చాలా మంది త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా ప‌లు ర‌కాల చికెన్ బిర్యానీ వెరైటీల‌ను తింటుంటారు. అది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. బిర్యానీ ప్రియులు క‌చ్చితంగా ఆ వంట‌కాన్ని ఇష్టపడతారు. అయితే, మీరు ఎప్పుడైన ‘ఇల్యూజన్ బిర్యానీ’ ట్రై చేశారా?. ఈ ప్రత్యేకమైన బిర్యానీ ఢిల్లీ కేఫ్‌లో వడ్డిస్తారు. దీనిని “ఖయాలీ పులావ్”,”మసాలా భాత్” అంటూ పేర్లు కూడాపెడుతున్నారు నెటిజన్లు.
Also Read: Baby boy sold: నవజాత శిశువును అమ్మేసిన తల్లి

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో భ్రమలకు కొత్తేమీ కాదు. దాదాపు ప్రతిరోజూ మనం ఏదో ఒక రకమైన ట్రిక్ లేదా భ్రమ ఆధారంగా వైరల్ పోస్ట్‌లను చూస్తాం. కొన్నిసార్లు వాటిని చూసి ఆశ్చర్యపోతాం. అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ హోటల్ లో బౌల్ లో బిర్యానీ మసాలాలు వేశాడో వ్యక్తి. బిర్యాలీలో వేసే అన్ని రకాల దినుసులు వేశాడు. అనంతరం దానికి మూత పెట్టి.. చేతిలో తీసుకుని కాసేపు మ్యాజిక్ చేశాడు. అది కాస్తా వేడి వేడి బిర్యానీగా బయటకొచ్చింది.

ఒక వ్యక్తి బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల సాదా బియ్యం, సాధారణ బిర్యానీ మసాలాలు, వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్డు కలుపుతున్నట్లు వీడియో చూపిస్తుంది. అతను కొన్ని సెకన్ల పాటు కూజాను కదిలించాడు. అతను దానిని తెరిచి, దానిలోని పదార్థాలను ప్లేట్‌లోకి వడ్డించాడు. దాని నుండి బిర్యానీ లాంటి బియ్యం రావడం కనిపిస్తుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ‘ఇల్యూజన్ బిర్యానీ’ అని పేరు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు వివిధ రకాలు స్పందిస్తున్నారు. ఈ రీల్‌కి ఇప్పటివరకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ వంటకాన్ని ప్రదర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బిర్యానీ అని పిలవలేమని పేర్కొన్నారు. బియ్యం గింజలు ఇప్పుడు సాదాగా ఉండవు, మసాలా కారణంగా పసుపు రంగులో ఉంటాయి. అయితే అది ఎలా సాధ్యం? కామెంట్స్‌లో నెటిజన్లు తమ సిద్ధాంతాలను పంచుకున్నారు.