NTV Telugu Site icon

ఈ రోబోట్స్ అందుబాటులోకి వ‌స్తే…వినాశ‌న‌మే…!!

ప్ర‌పంచంలో స‌మ‌ర్థ‌వంత‌మైన‌, అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధాలను త‌యారు చేసేందుకు అగ్ర‌రాజ్యాలు సిద్ద‌మ‌వుతున్నాయి.  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌, రోబోటిక్ టెక్నాల‌జీని బేస్ చేసుకొని స్వీయ నియంత్రిత కిల్ల‌ర్ రోబోట్స్‌ను త‌యారు చేసేందుకు చైనా, అమెరికా, ర‌ష్యా దేశాలు స‌న్నాహాలు చేస్తున్నాయి.  రోబోటిక్ టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత అనేక రంగాల్లోకి రోబోలు ప్ర‌వేశించాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ప్రొగ్రామ్ ఆప‌రేటింగ్ లేదా రిమోట్ కంట్రోల్ తో ప‌నిచేసే రోబోలు అందుబాటులో ఉండ‌గా, ఇప్పుడు స్వీయ నియంత్రిత రోబోలను అందుబాటులోకి రాబోతున్నాయి.  

Read: మ‌హా అసెంబ్లీలో 50 మందికి క‌రోనా…

వీటిని యుద్ధాల‌లో వినియోగించేందుకు త‌యారు చేస్తున్నారు.  టార్గెట్ ఫిక్స్ చేసుకున్న త‌రువాత కిల్ల‌ర్ రోబోలు ఎటాక్ చేస్తాయి.  టార్గెట్ పూర్తిగా న‌శించిందా లేదా అని అవి చెక్ చేసుకున్నాక అక్క‌డి నుంచి ముందుకు క‌దులుతాయ‌ట‌. లిబియాలో మొద‌టి స్వీయ నియంత్రిత కిల్ల‌ర్ రోబోట్‌ను త‌యారు చేసి ప‌రీక్షించారు.  ఈ ర‌క‌మైన రోబోల‌ను త‌యారు చేస్తే ప్ర‌పంచం వినాశ‌నం అవుతుంద‌ని ఐరాస ఆందోళ‌న చెందుతున్న‌ది.  భ‌విష్య‌త్తులో యుద్ధం అంటూ వ‌స్తే ఈ కిల్ల‌ర్ రోబోట్స్ కీల‌కంగా మార‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.