Site icon NTV Telugu

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రం ఇదే…

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్యారిస్‌, సింగపూర్‌, జ్యూరిచ్‌, హాంకాంగ్‌, న్యూయార్క్‌, జెనీవా ఇలా టాప్ టెన్ న‌గ‌రాల జాబితాలో ఉండేవి.  అయితే, ఈసారి వీట‌న్నింటిని వెనక్కి నెట్టింది టెల్ అవీవ్ న‌గ‌రం.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోవ‌డం, ద్ర‌వ్యోల్భ‌ణం పెరిగిపోవ‌డం, ఆదాయ మార్గాలు అడుగంటి పోవ‌డం, ధ‌ర‌లు పెరిగిపోవ‌డం, డాల‌ర్‌తో అక్క‌డి క‌రెన్సీ మార‌క విలువ పెర‌గ‌డం, డిమాండ్ కు తగిన‌ట్టుగా స‌ప్లై లేక‌పోవ‌డంతో వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సాధార‌ణ జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయింది.  

Read: విమాన స‌ర్వీసుల‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: నిషేధం కొన‌సాగింపు…

క‌రోనా మ‌హ‌మ్మారికి ముందు మనిషి జీవ‌న విధానంతో పోలిస్తే, క‌రోనా త‌రువాత జీవ‌న విధానం మ‌రింత ఖ‌రీదైంద‌ని చెప్పాలి.  అయితే, టెల్ అవీవ్ న‌ర‌గంలో మిగ‌తా వాటితో పోలిస్తే కొంత భిన్నంగా ఉండ‌టంతో పాటుగా ఇజ్రాయిల్ క‌రెన్సీ షెక‌ల్ బలప‌డ‌టంతో ఈ న‌గ‌రం అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచింది.  ప్యారిస్‌, సింగ‌పూర్ న‌గ‌రాలు సంయుక్తంగా రెండో స్తానంలో నిల‌వ‌గా, జ్యూరిచ్ మూడో స్థానంలో, హాంకాంగ్ నాలుగో స్థానంలో, న్యూయార్క్ ఆరో స్థానంలో, జెనీవా ఏడో స్థానంలో నిలిచాయి.  గ‌తేడాది ప్యారిస్‌, జ్యూరిచ్‌, హాంకాంగ్‌లు సంయుక్తంగా మొద‌టిస్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.  

Exit mobile version