Site icon NTV Telugu

2022, జ‌న‌వ‌రి 1 నాటికి ప్ర‌పంచ జ‌నాభా ఎంతో తెలుసా?

ప్ర‌పంచంలో నాలుగింట మూడొంతులు నీళ్ల‌తో నిండిపోగా, ఒక వంతు మాత్ర‌మే భూమి ఉన్న‌ది.  ఈ ఒక వంతు భూమిపై ప్ర‌స్తుతం ఎంత‌మంది నివ‌శిస్తున్నారు, సెక‌నుకు ఎంత మంది పుడుతున్నారు, ఎంత మంది మ‌ర‌ణిస్తున్నారు అనే విష‌యాల‌ను అమెరికాకు చెందిన సెన్సెస్ బ్యూరో ఓ నివేదిను త‌యారు చేసింది.  2021 లో ప్ర‌పంచ జ‌నాభా భారీగా పెరిగిన‌ట్టు అంచ‌నా వేసింది.  2022 జ‌న‌వ‌రి 1 నాటికి ప్ర‌పంచ జ‌నాభా 786 కోట్లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది.  2021 జ‌న‌వ‌రి 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 0.95 శాతం జ‌నాభా పెరిగిన‌ట్టు అమెరికా సెన్సెక్స్ బ్యూరో అంచ‌నా వేసింది.  2022 జ‌న‌వ‌రిలో ప్ర‌పంచ జ‌నాభా ప్ర‌తి సెక‌నుకు 4.3 జ‌న‌నాలు, 2 మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం ఉన్న‌ట్టు అమెరికా సెన్సెస్ బ్యూరో నివేదిక‌లో పేర్కొన్న‌ది.  

Read: ‘రైజ్ ఆఫ్ రామ్’: అల్లూరి రాజసం.. గూస్ బంప్స్ రావడం ఖాయం

Exit mobile version