NTV Telugu Site icon

కోళ్లు కాదు… తేళ్ల పెంప‌కం… ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు…

కాదేది క‌విత‌కు అన‌ర్హం అన్నారు మ‌హాక‌వి శ్రీశ్రీ.  తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు.  చైనీయుల ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగానే క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టుకొచ్చింది.  ఏది క‌నిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్ద‌హ‌స్తులు.  ఇదే ఇప్పుడు ప్ర‌పంచానికి చేటుగా మారింది.  క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక‌వ్య‌వ‌స్థ కుదేల‌యింది.  కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.  క‌రోనా నుంచి ప్ర‌పంచం అనేక పాఠాలు నేర్చుకున్న‌ది.  

Read: జైల్లో గ్యాంగ్ వార్‌: 68 మంది మృతి…

కానీ, చైనాలో మాత్రం ఏ మార్పు రాలేదు.  ఆహార‌పు అల‌వాట్ల‌ను మానుకోలేదు.  పైగా ఇప్పుడు అక్క‌డ తేళ్ల పెంప‌కం పెరిగింది.  కోళ్ల‌ను, మేక‌ల‌ను పెంచిన‌ట్టుగా తేళ్ల‌ను పెంచుతున్నారు.  తేళ్ల పెంప‌కం ఇప్పుడు గృహ‌ప‌రిశ్ర‌మ‌గా మారిపోయింది.  ఓ మ‌హిళ ఇంటిపైన తేళ్ళ‌ను పెంచుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.  దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  ఇప్ప‌టికే క‌రోనాతో ప్ర‌పంచం అత‌లాకుత‌లం అయిందని, ఇప్పుడు మ‌రో కొత్త వ్యాధిని క‌నిపెట్టేందుకు చైనా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.  

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి