NTV Telugu Site icon

ఆ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గని కేంద్రం… వచ్చే సమావేశాల నిర్వహణ అక్కడే…  

భారత  దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు.  ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది.  కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ.  వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే పార్లమెంట్ సమావేశాలను కొత్త  భవనంలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.  అయితే,  సెంట్రల్ విస్టా భవనాల నిర్మాణాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.  కరోనా కాలంలో ఆ నిధులను వ్యాక్సిన్ కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాయి.  కానీ, కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు, వ్యాక్సిన్ కొనుగోలు కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే నిధులు కేటాయించామని, వ్యాక్సిన్ కు, దీనికి సంబంధం లేదని కేంద్రం చెప్తున్నది.  కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ప్రాజెక్టు కోసం 400 మంది పనులు నిర్వహిస్తున్నారు.  వచ్చే ఏడాది వరకు పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ నిర్మాణం పూర్తి చేయనున్నారు.