ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభత్వం ఏర్పాటయ్యి మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించక ముందే తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. పాక్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ప్రస్తుతం ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే, ఆఫ్ఘన్ ప్రజా ప్రభుత్వం కూలిపోయిన వెంటనే అంతర్జాతీయంగా ఆ దేశానికి అందాల్సిన నిధులను ప్రపంచ దేశాలు నిలిపివేయడంతో దేశీయంగా ధరలు భారీగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకుంటే అంతర్జాతీయంగా ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుందని తాలిబన్ నేతలు చెబుతున్నారు.
Read: ఏపీలో గంజాయి పండుగ.. ఎక్కడ చూసిన సంచులకు సంచులే..
చివరిసారి అమెరికా, తాలిబన్‌ల మధ్య చర్చలు, దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడం వలనే దేశీయంగా యుద్ధం సంభవించినట్టు తాలిబన్లు చెబుతున్నారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అటు చైనా, పాక్‌లు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణల తరువాత తాలిబన్ నాయకుల వైఖరిలో మార్పులు రావడం, అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తామని, మహిళలను గౌరవిస్తామని, సరళీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన తాలిబన్లు ఆ తరువాత చెప్పిన మాటలను పక్కన పెట్టి యథా ప్రకారమే చేసుకుంటు పోవడంతో ప్రజల్లోనే కాకుండా ప్రపంచదేశాల్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. బహుశా తాలిబన్లపై నమ్మకం లేకనే ప్రపంచ దేశాలు వారి ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు.
