NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ను వ్యాక్సిన్‌లు పూర్తిగా అడ్డుకోలేవా?

ప్ర‌పంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భ‌య‌పెడుతున్న‌ది.  సౌతాఫ్రికాలో మొద‌లైన ఈ వేరియంట్ వేగంగా అన్ని దేశాల‌కు వ్యాపిస్తోంది.  వ్యాక్సిన్ ఎంత మేర‌కు ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలుగుతుంది అనే దానిపై ప్ర‌స్తుతం శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఒమిక్రాన్ వేరియంట్‌ను పూర్తిగా అడ్డుకోలేవ‌ని, ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  

Read: పెట్రోల్ బంకుల్లో ఈ సేవ‌లు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా…

వ్యాక్సిన్ తీసుకోవ‌డం కొంత మంచిదే అని,  వేరియంట్ తీవ్ర‌త‌, మ‌ర‌ణం నుంచి కాపాడ‌గల‌డం స‌రైందే అని డ‌బ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా రీజిన‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పూన‌మ్ ఖేత్ర‌పాల్ పేర్కొన్నారు.  రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండేవారికి ముందుగా బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని బూస్ట‌ర్ డోసుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, ప్రాథ‌మిక వ్యాక్సిన్ల గురించి విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని అమె పేర్కొన్నారు.