Site icon NTV Telugu

కౌన్‌ బనేగా ‘ఒమిక్రాన్‌పతి’..?

కరోనా మహహ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా ధాటికి ఎన్నో దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ కరోనా ప్రభావం నుంచి కోలుకోవడం లేదు. కరోనా కట్టడికి తీసుకువచ్చిన కోవిడ్‌ టీకాల పంపిణీ కూడా ఎంతో వేగవంతంగా సాగుతోంది. అయినా కూడా కరోనా మహహ్మరి రూపాలు మార్చుకోని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లతో తలమునకలవుతోన్న వేళ మరో కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలను సైతం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ వివిధ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను గుర్తించి 10 రోజులే అయినా.. ఇప్పటికే దీని బారిన పలుదేశాలు పడి గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే భారత్‌ కూడా ఒమిక్రాన్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రాలు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి భారత్‌ వస్తోన్న విమానాలపై ఆంక్షలు విధించారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటకువచ్చి 10 రోజులవుతోంది.. ఇది డెల్టా వేరియంట్‌ కంటే 6రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విదేశాలకు వ్యాపార, ఉద్యోగ, పర్యటనతో పాటు తదితర అవసరాల కోసం రోజూ వేలాది మంది భారతీయులు, విదేశీయులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో గత 10 రోజుల నుంచి ఒమిక్రాన్‌ సోకిన దేశాల నుంచి చాలా మందే భారత్‌లోకి వచ్చారు. దీంతో ప్రస్తుతం ప్రజల్లో భయం నెలకొంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశంలోకి ప్రవేశించి ఉంటుందా..? అనే ప్రశ్న భారతీయుల్లో నెలకొంది. అయితే భారత్‌లో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ కేసు ఏ రాష్ట్రంలో నమోదవుతోందనని అందరూ భయం గుప్పిట్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్‌ కేసుల బెడద మరింత ఎక్కువగా ఉంది. అక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే వెలుగు చూడటం అనేది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే సౌతాఫ్రికా నుంచి భారత్‌లోకి వచ్చేందుకు దేశరాజధాని ఢిల్లీతో పాటు ముంబాయి, చెన్నై ఎయిర్‌పోర్టులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్‌లకు మాత్రమే సౌతిఫ్రికాలాంటి దేశాల నుంచి నేరుగా విమానాలు నడుస్తున్నాయి.

దీంతో ఒమిక్రాన్‌ భయం ఈ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒమిక్రాన్‌కు వీసా ఇచ్చి భారత్‌లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారా.. లేక.. నో ఎంట్రీ బోర్డు పెట్టారో.. చూడాలి మరి..

Exit mobile version