Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. ఢిల్లీలో నేటి ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు.
  2. కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
  3. ఇందిరా పార్క్‌వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన ‘కర్షకుల కోసం కాంగ్రెస్‌’ వరి దీక్ష నేడు రెండవ రోజుకు చేరుకోనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ దీక్ష యుగియనుంది.
  4. నేడు ఉదయ 9 గంటలకు ఆన్‌లైన్‌లో వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
  5. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ నేడు జరుగనుంది. పార్లమెంట్‌లో వరి కొనుగోళ్లపై అనుచరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
  6. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.67,900లుగా ఉంది.

Exit mobile version