* నేడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు..
* నేడు ఉండవల్లిలో టీడీపీ కీలక సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు.. టీడీపీ సంస్థగత ఎన్నికలు.. రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంశాలపై చర్చ.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
* నేడు గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలో పాల్గొనున్న పెమ్మసాని..
* నేడు విశాఖలో మత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన.. జనసేన విస్తృత స్థాయి సమావేశాల ఏర్పాట్లు పరిశీలన..
* నేడు హైదరాబాద్ కు ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి.. సుదర్శన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం..
* నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పీఏసీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రస్థాయి కమిటీల నిర్మాణం, యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై చర్చ..
* నేడు బీఆర్ఎస్ లీగల్ సెల్ కీలక సమావేశం.. జిల్లాల్లో బీఆర్ఎస్ లీగల్ విభాగం ఏర్పాటుకు ప్రతిపాదన.. సమావేశానికి హాజరుకానున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు..
* నేడు మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్..
* నేడు సహస్ర హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్.. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్.. సహస్ర హత్య కేసు వివరాలు వెల్లడించనున్నడీసీపీ..
* నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీట్ ది ప్రెస్.. ఉదయం 11 గంటలకు రంగనాథ్ మీట్ ది ప్రెస్..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు..
