Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు 3వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న సభ.. మెడికల్ కాలేజీల అంశంపై ఈరోజు అసెంబ్లీలో చర్చ.. మెడికల్ కాలేజీలపై సమాధానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు..

* నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.. 28వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న సీఎం.. సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ థీమ్ తో ఈ ఏడాది సదస్సు..

* నేటి నుంచి విశాఖలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు.. సదస్సుకు హాజరుకానున్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్..

* నేటి నుంచి 11 రోజుల పాటు అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు శరన్నవరాత్రులు.. అమ్మవారు నేడు త్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనం.. ఈసారి ప్రత్యేకంగా కాత్యాయినీ దేవీగా అవతారంలో అమ్మవారి దర్శనం..

* నేటి నుంచి విజయవాడ ఉత్సవ్.. విజయవాడలోని ఐదు ప్రదేశాల్లో ఉత్సవాలు.. చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు..

* నేడు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన.. కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు.. సింగరేణి కార్మికుల కోసం కీలక ప్రకటన చేసే అవకాశం..

* నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

* నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన..

* నేటి నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ ధరలు.. పలు నిత్యవసర వస్తువులపై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ ధర తగ్గింపు.. ఆరోగ్య బీమా, పలు స్టేషనరీ వస్తువులపై సున్నా జీఎస్టీ.. స్వల్పంగా తగ్గనున్న పాలు, నెయ్యి, పన్నీర్ ధరలు..

* నేడు అరుణాచల్, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. రూ. 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

* నేడు అమెరికా వెళ్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ టీమ్.. ట్రేడ్ డీల్ కోసం ఈరోజు అమెరికతో ఆరో విడత చర్చలు.. అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు..

Exit mobile version