Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ.. తెలంగాణ జిల్లా్ల్లో ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు.. హనుమకొండలో జరిగే వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు.. వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు..

* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన.. మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న కవిత..

* నేడు బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 3కే రన్.. నెక్లెస్ రోడ్ లో ప్రారంభంగానున్న 3కే రన్.. డ్రగ్స్ ప్రీ దేశంగా మార్చాలని రన్ చేపట్టిన బీజేపీ..

* నేడు ఐదో రోజు క్యాప్స్ గోల్డ్ లో ఐటీ సోదాలు.. ఇప్పటికే ఓ జ్యువెలరీ షాప్ ను సీజ్ చేసిన అధికారులు..

* నేడు రాజమండ్రిలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి..

* నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు.. దసరా సెలవులతో గ్రామాలకు ప్రయాణాలు.. హైదరాబాద్- రహదారిపై వాహనాల రద్దీ.. పంతంగి టోల్ ప్లాజా దగ్గర బారులుతీరినా వాహనాలు..

* నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త ధరలు.. సామాన్యుడికి అందుబాటులోకి రానున్న ధరలు..

* నేటి నుంచి చండీగఢ్ లో ఐదు రోజుల పాటు సీపీఐ మహాసభలు.. సభలకు హాజరుకానున్న 750 మంది ప్రతినిధులు..

* నేటి నుంచి మావోయిస్టు 21వ ఆవిర్భావ వారోత్సవాలు.. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాలు.. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్..

* నేడు సూర్యగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి అతి పెద్ద సూర్యగ్రహణం.. వందేళ్లకు ఒకసారి సంభవించే గ్రహణమన్న పండితులు.. ఆదివారం, అమావాస్య రోజే గ్రహణం సంభవించడంతో.. కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందన్న సిద్ధాంతులు.. భారత్ లో గ్రహణం కనిపించే అవకాశం లేదన్న జ్యోతిష్యులు..

* నేడు ఆసియా కప్ లో భారత్ vs పాకిస్థాన్ మధ్య పోరు.. దుబాయ్ వేదికగా రాత్రి 8గంటలకి మ్యాచ్..

Exit mobile version