నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. సొమశీల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం.. శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ ఇంటి దగ్గర ప్రజావాణి కార్యక్రమం.. శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆర్జీల స్వీకరణ.. సమస్యలు ఉన్న వారు హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా ఏర్పాట్లు..
నేటి నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..
నేడు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్.. రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్ధేశం..
నేడు మంచిర్యాల జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన..
నేడు సీఎం చంద్రబాబును కలవనున్న ఎమ్మెల్యే కొండబాబు.. మాజీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసే అవకాశం.
నేడు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్ లకు మాక్ పోలింగ్.. రీ కౌంటింగ్ కోసం ఈసీకి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు.. మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేసేందుకు సిద్ధమైన ఈసీ..
నేటి నుంచి షికాగోలో డెమోక్రటిక్ జాతీయ సదస్సు.. ప్రెసిడెంట్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ ను ఆమోదించనున్న సదస్సు..
నేడు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం..
నేడు నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. లక్కిడీప్ విధానంలో కేటాయించే టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఎల్లుండి లక్కిడీప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Whats Today On 19th August 2024

Whatstoday