* నేడు ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. రాష్ట్రంలో రక్షణ శాఖ భూముల బదలాయింపు, సైనిక్ స్కూల్స్ ఏర్పాటుపై చర్చ..
* నేడు ఫార్ములా-ఈ రేస్ కారు కేసులో గవర్నర్‌కు ACB నివేదిక ఇవ్వనున్న ప్రభుత్వం.. కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్‌కి ACB రెడీ.. గవర్నర్ అనుమతి రాగానే చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం..
* నేడు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ.. సూపర్ సిక్స్- సూపర్ హిట్ పేరిట కూటమి ఉమ్మడి సభ.. 15 నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై వివరణ.. బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఇతర మంత్రులు..
* నేడు తాడేపల్లి వైసీపీ ఆఫీసులో వైఎస్ జగన్ ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు అంశాలపై ప్రెస్ మీట్..
* నేడు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న అనిల్ కుమార్ సింఘాల్.. అలిపిరి నడకమార్గంలో తిరుమల చేరుకోనున్న సింఘాల్.. ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న సింఘాల్..
* నేడు ఏసీబీ కస్టడీలోకి ఐపీఎస్ అధికారి సంజయ్.. రెండు రోజుల పాటు ప్రశ్నించనున్న ఏసీబీ అధికారులు.. ఫైర్ డిపార్ట్మెంట్ లో నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన సంజయ్..
* నేడు ఫిల్మ్ నగర్ భూవివాదంపై నాంపల్లి కోర్టులో విచారణ.. ఫిల్మ్ నగర్ లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చారని నందకుమార్ ఫిర్యాదు.. నందకుమార్ ఫిర్యాదు మేరకు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు.. విచారణలో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరుకావాలని.. దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్ కు నాంపల్లి కోర్టు ఆదేశం.. విచారణకు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే ఛాన్స్..
* నేడు ఆసియా కప్ లో భారత్ వర్సెస్ యూఏఈ మధ్య పోరు.. దుబాయ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకి మ్యాచ్..
