* నేడు వైజాక్ కి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అనకాపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న భట్టి..
* నేడు ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సింగూరు ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి దామోదర..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు..
* నేడు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇండీ డాగ్ అడప్షన్ డ్రైవ్.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జలగం వెంగళరావు పార్క్ లో కుక్క పిల్లల దత్తత ఇవ్వనున్న జీహెచ్ఎంసీ.. వీధి కుక్కలను తగ్గించడానికి ఇండీ డాగ్ ఆడాప్షన్ ప్రోగ్రామ్ చేపట్టిన జీహెచ్ఎంసీ.. ఇండీ డాగ్ అడాప్షన్ లో దత్తత ఇచ్చే కుక్కలను ఆరోగ్య కరమైన టీకాలు వేసిన కుక్క పిల్లలను మాత్రమే అందించనున్న జీహెచ్ఎంసీ.. ఇతర పెంపుడు కుక్కలతో పోల్చితే.. వీటికి మైంటేనెన్స్ కూడా తక్కువే అంటున్న బల్దియా అధికారులు..
* నేడు పాలకొల్లులో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్.. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుక కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్..
* నేడు విశాఖ బీచ్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ.. ఓట్ చోరీపై నిరసన ప్రదర్శనకు హాజరుకానున్న పార్టీ సీనియర్లు..
* నేడు రెండో రోజు పోలవరం నిర్వాసితుల ప్రాంతాల్లో సీపీఎం నేతలు పర్యటన.. పాల్గొననున్న సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్.. ఉదయం 11 గంటల నుంచి చింతూరు మండలంలో నిర్వాసితుల కాలనీలు పర్యటన..
* నేడు ఏపీకి భారీ వర్ష సూచన.. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు..
* నేడు తిరుమలకు కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి, శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం..
* నేడు నిర్మాతలను, ఫెడరేషన్ సభ్యులను విడివిడిగా కలవనున్న మెగాస్టార్ చిరంజీవి.. తర్వాత ఇరు వర్గాలనూ కలిపి మాట్లాడనున్న చిరంజీవి.. సమస్యను త్వరగా ముగించాలని ఇరు వర్గాలతో మాట్లాడనున్న చిరంజీవి..
* నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్న శుభాంశు శుక్లా.. తన అనుభవాలను ప్రధానికి వివరించనున్నర శుక్లా..
* నేటి నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభం.. మొత్తం 1,300 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ యాత్ర.. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగియనున్న రాహుల్ గాంధీ యాత్ర..
* నేడు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ..
నేడు మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్.. బీహార్ ఓటర్ లిస్ట్, రాహుల్ ఆరోపణలపై రియాక్షన్!
