* నేడు స్వచ్ఛాంధ్ర-2025 అవార్డుల ప్రధానం.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల తరహాలో స్వచ్ఛాంధ్ర అవార్డులు.. ఈ అవార్డులను ప్రధానం చేయనున్న సీఎం చంద్రబాబు.. మొత్తం 21 కేటగిరిల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డుల ప్రధానం.. రాష్ట్రస్థాయిలో 69, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు..
* నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 12.10 అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..
* నేడు కాకినాడలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర అవార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రి నారాయణ..
* నేడు ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు.. ఏపీసీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ లో చట్టపరమైన లోపాలున్నాయని పేర్కొన్న సిట్..
* నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ.. విచారణ జరపనున్న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వంగా గోపాల్ రెడ్డి..
* నేడు తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక సమావేశం.. సీసీఐ ఎండీ, జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల భేటీ.. రైతులకు మద్దతు ధర దక్కేలా చర్చలు జరపనున్న తుమ్మల..
* నేడు హెచ్ఎండీఏ ఆఫీస్ ఎదుట ఆర్ఆర్ఆర్ బాధితుల ధర్నా.. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగనున్న ఆర్ఆర్ఆర్ నిర్వాసితులు..
* నేడు ఆందోల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. వట్ పల్లిలో అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కానున్న హరీష్ రావు..
* నేడు విశాఖలో కేంద్రమంత్రి సర్బానంద పర్యటన.. దేశంలోనే తొలిసారి విశాఖకు గ్యాస్ క్యారియర్ నౌక.. ఇవాళ శివాలిక్ నౌకకు స్వాగతం పలకనున్న కేంద్రమంత్రి..
* నేడు హమాస్- ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలపై ఈజిప్ట్ లో ప్రారంభంగానున్న హమాస్- ఇజ్రాయెల్ చర్చలు..
* నేడు డార్జిలింగ్ లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటన.. డార్జిలింగ్ లో వరదలు, విరిగిపడ్డ కొండచరియలతో 25 మంది మృతి, పలువురికి గాయాలు.. డార్జిలింగ్ లో పూర్తిగా స్తంభించిన రవాణా వ్యవస్థ..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య పోరు.. మధ్యాహ్నం 3గంటలకి ఇండోర్ వేదికగా మ్యాచ్..
