NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు తిరుపతికి ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ రోజు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో ప్రారంభోత్సవం.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు సహా మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్..

* నేడు ప్రయాగ్ రాజ్ పర్యటనకు మంత్రి నారా లోకేశ్.. ఉదయం మహాకుంభాభిషేకం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం.. మధ్యాహ్నం ఒంటగంటకు అక్కడి నుంచి వారణాసికి లోకేశ్.. రాత్రి 7.30కు తిరిగి విజయవాడకు బయల్దేరనున్న మంత్రి లోకేశ్..

* నేడు విజయవాడలో జనసేన ఆత్మీయ సమావేశం.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సమావేశం.. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆత్మీయ సమావేశం..

* నేడు మంత్రి కొల్లు రవీంద్ర క్యాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. 2020-21లో నమోదైన కోర్టు ధిక్కారణ కేసులను క్యాష్ చేయాలని పిటిషన్.. మొత్తం 3 పిటిషపన్లపై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు..

* నేడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విచారణ.. వాంగ్మూలం ఇవ్వనున్న సత్యవర్థన్..

* నేడు వల్లభనేని వంశీని మరింత విచారణ చేయడానికి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్.. నేడు విచారణ వచ్చే అవకాశం..

* నేడు బెయిల్ పిటిషన్ వేయనున్న వల్లభనేని వంశీ..

* నేటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు దేవాలయాల సమ్మేళనం.. హాజరుకానున్న 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు..

* నేడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, పండ్లు పంపిణీ కార్యక్రమాలు.. తెలంగాణ భవన్ లో వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు..

* నేడు గ్రేటర్ హైదరాబాద్ బంద్ కు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల పిలుపు.. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిలిచిపోనున్న నిర్మాణ పనులు..

* నేడు దూరజ్ పల్లి పెద్దగట్టుకు దేవరపెట్టే.. వైభవంగా పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.. జాతర నేపథ్యంలో ఆంక్షలు.. విజయవాడ- హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.. రెండు రోజుల పాటు వర్తించనున్న ట్రాఫిక్ ఆంక్షలు..

* నేడు ఢిల్లీలో బీజేఎస్పీ సమావేశం.. సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం.. ఈ నెల 19 లేదా 20న సీఎంగా ప్రమాణం చేసే అవకాశం..

* నేటికి 36వ రోజు మహా కుంభమేళా.. కుంభమేళాకు భారీగా తరలి వస్తున్న భక్తులు..

* నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య మహిళల జట్టు.. వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్.