ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. తాలిబన్ అగ్రనేతలు అఖుండ్ జాదా, బరదర్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మార్పులు జరిగాయి. తాలిబన్ల కంటే ప్రభుత్వంలో హుక్కాని గ్రూప్ లకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు హుక్కాని గ్రూప్ కు, తాలిబన్లకు మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద రగడ జరిగిందని, ఈ రగడలో హైబతుల్లా అఖుండ్ జాదా మృతి చెందారని, బరదర్ ను బందీగా చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు పాక్ ఐఎస్ఐ చీఫ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చి తాలిబన్లతో చర్చలు జరపడంతో సీన్ మారిపోయిందని, సమీకృత ప్రభుత్వం ఏర్పాటును కాకుండా తమ చెప్పుచేతల్లో ఉంచుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పాక్ కుట్రలు చేసిందని కథనాలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ను పాక్ తన అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. హైబతుల్లా అఖుండ్ జాదా, బరదర్ ఏమయ్యారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆఫ్ఘన్ లో ఏం జరుగుతోంది… ఆ ఇద్దరు కీలక నేతలు ఏమయ్యారు?
