NTV Telugu Site icon

వాటెన్ ఐడియా.. ప్లాస్టిక్ వ్యర్ధాలకు ఇలా చెక్ చెబుదామా?

హైదరాబాద్‌ డ్రైనేజీల ముంపు సమస్యకు చక్కని పరిష్కారం చూపించాడో నెటిజన్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి వ్యర్ధాలు నేరుగా కాలువల్లోకి కలిసి పోకుండా ఆయా కాలనీల నుంచి ప్రధాన కాలువల్లోకి వచ్చే చోట నెట్ లాంటిది తగిలించాల్సిన అవసరం వుంది. ఈ వ్యర్ధాలు అందులో వుండిపోతాయి. మురుగునీరు మాత్రం బయటకు పోతుంది.

ప్లాస్టిక్ బాటిళ్ళు, చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఈ నెట్‌లో వుండిపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో కాలుష్యం జరగకుండా వుంటుంది. అవి నిండిపోయాక వాటిని తీసి పారేయవచ్చు. తిరిగి కొత్త నెట్ ఏర్పాటుచేయవచ్చని నెటిజన్ సూచించాడు. ఈ టెక్నాలజీ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో పాటు జీహెచ్‌ఎంసీ, మంత్రి కేటీఆర్, కమిషనర్ జీహెచ్‌ఎంసీలను ట్యాగ్ చేశాడు. నెటిజన్ సూచనలను అధికారులు పరిశీలించి ప్రశంసించారు. ఇంజనీర్లతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు రిప్లై ఇచ్చారు.