NTV Telugu Site icon

లాక్ డౌన్ లో స్వీట్స్  కొనుగోలు కోసం యువకుడి తంటాలు 

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్ష‌లు అమలు చేస్తున్నారు. బెంగాల్ లో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్నారు.  అయితే, లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నా, కొంత స‌మ‌యంపాటు స‌డ‌లింపులు ఇస్తున్నారు.  లాక్ డౌన్ స‌డ‌లించిన స‌మ‌యంలో అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తున్నారు.  అయితే, కొంత‌మంది మాత్రం ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తు పోలీసుల‌ను ఇబ్బందులు పెడుతున్నారు.  బెంగాల్‌లో లాక్‌డౌన్‌ను అమ‌లుచేస్తున్నా, బెంగాలీ స్వీట్స్ అమ్మ‌కాల కోసం కొంత స‌మ‌యంపాటు షాపుల‌ను తెరిచే ఉంచుతున్నారు.  ఓ వ్య‌క్తి బెంగాలీ స్వీట్స్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చి పోలీసుల‌కు దొరికిపోయాడు.  ఎక్క‌డికి వెళ్లాలి అని పోలీసులు అడిగితే, స్వీట్స్ కోసం వ‌చ్చిన‌ట్టు మెడ‌లో బోర్డును చూపించి అడిగాడు.  ఐడి కార్డు, స్పెష‌ల్ పాస్ వెసుకున్న‌ట్టుగా ఆ యువ‌కుడు మెడ‌లో బెంగాలీ స్వీట్స్ కావాలి అంటూ బోర్డును మెడ‌లో వేసుకొని తిరుగుతున్నాడు.  ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.