ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం హస్తిన చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. బిజీబిజీగా గపడనున్నారు.. ఈ టూర్‌లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బెంగాల్ సీఎంగా ముచ్చటగా మూడో సారి విజయం సాధించిన దీదీ.. ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఉంటుందని తెలుస్తోంది.. మరోవైపు… సీనియర్ కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను సింఘ్విలతోనూ దీదీ సమావేశం కానున్నారు. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలతో భేటీ అవుతారని చెబుతున్నారు.. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొట్టాలన్నదే దీదీ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు.
హస్తినలో దీదీ బిజీ.. నేడు ప్రధాని మోడీతో భేటీ

Mamata Banerjee PM Modi