NTV Telugu Site icon

మాస్క్ తెచ్చిన చిక్కులు… ధ‌రించ‌లేక జేబులో పెట్టుకున్నాడు…

క‌రోనా కాలంలో మాస్క్‌లు ధ‌రించ‌డం కామ‌న్ అయింది.  ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాము అంటే అన్నింటితో పాటు ముఖానికి మాస్క్ ధ‌రించ‌డం కామ‌న్ అయింది.  మాస్క్ వాడ‌కం పెర‌గ‌డంతో వినూత్నంగా కొత్త కొత్త మాస్కులు అందుబాటులోకి వ‌చ్చాయి.  వెరైటీ డిజైన్‌తో ఆక‌ట్టుకునే విధంగా మాస్క్‌ల‌ను తీర్చిదిద్దుతున్నారు.  క‌రోనా త‌గ్గినా మాస్క్ కంప‌ల్స‌రీ చేయ‌డంతో మాస్క్ వాడ‌కం పెరిగిపోయింది.  ఇక ఇదిలా ఉంటే, కొంత‌మంది త‌మ ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు బంగారంతో మాస్కులు త‌యారు చేయించుకుంటున్నారు.  

Read: ఆ దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్… ప్ర‌త్యేకించి వారికోస‌మే…

ఇలానే, ప‌శ్చిమ బెంగాల్‌కు చంద‌న్ దాస్ అనే వ్యాపార‌వేత్త 108 గ్రాముల బంగారంతో 5 ల‌క్ష‌లతో మాస్క్ త‌యారు చేయించుకున్నాడు.  బెంగాల్‌లో దుర్గాదేవి పూజ‌ల సంద‌ర్భంగా వేడుక‌ల‌కు వెళ్లిన చంద‌న్ దాస్ ఆ మాస్క్ ను ధ‌రించాడు.  బంగారం మాస్క్‌ను చూసేందుకు పెద్ద సంఖ్య‌లో గుమిగూడ‌టంతో భ‌య‌ప‌డిన చంద‌న్ దాస్ ఆ మాస్క్‌ను తీసి జేబులో పెట్టుకున్నాడ‌ట‌.  దీనికి సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.  బంగారం మాస్క్ పెట్టుకోవ‌డం ఎందుకు దానికి కాపాడుకోవ‌డానికి తిప్ప‌లు ప‌డ‌టం ఎందుకు అని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.