ఆ దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్… ప్ర‌త్యేకించి వారికోస‌మే…

గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉన్న‌ది.  కొన్ని దేశాల్లో క‌రోనా దాదాపుగా త‌గ్గిపోయినా, కొన్ని చోట్ల త‌గ్గిన‌ట్టు త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది.  దీంతో నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమలు చేస్తున్నారు.  క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌ప్ప‌నిస‌రిగా టీకాలు తీసుకోవాలి.  ప్ర‌తీ దేశంలో టీకాలు వేస్తున్నారు.  అయితే, కొంత‌మంది టీకాలు తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తున్నారు.  వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి అక్క‌డి ప్ర‌భుత్వాలు.  ఇక యూర‌ప్‌లోని ఆస్ట్రియాలో కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చారు.  

Read: మ‌స్క్‌కు నెటిజ‌న్లు చుర‌కలు… ఎల‌న్‌కు ఏమైందంటూ ట్వీట్లు…

దేశ జ‌నాభాలో 65 శాతం మంది ఇప్ప‌టికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు.  అయిన‌ప్ప‌టికీ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.  దేశంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ఆ లాక్‌డౌన్ అంద‌రికీ కాదని, ఎవ‌రైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని, వ్యాక్సిన్ తీసుకోని వ్య‌క్తులు ఇంట్లోనే ఉండాల‌ని, బ‌య‌ట‌కు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది ప్ర‌భుత్వం.  

Related Articles

Latest Articles