Site icon NTV Telugu

శాశ్వత పరిష్కారం కోసమే ఎస్‌ఎన్డీపీని తీసుకొచ్చాం : కేటీఆర్‌

ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్‌కి ఈ రోజు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకేటేశ్‌, ముఠా గోపాల్‌ సహా పలువరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాల వలన ప్రజలను బాగా ఇబ్బంది పడ్డారని, అప్పుడు ఇక్కడ పర్యటించి సమస్యలు తెలుసుకున్నామని ఆయన తెలిపారు.

ఇక్కడ రిటేనింగ్ వాల్ ను నిర్మిస్తే ఇబ్బంది ఉండదు అని తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం నాళాల కోసం ఎస్ఎన్డీపిని తీసుకొచ్చామన్నారు. ఇదే విషయాన్ని సీఎంకు వివరించామని, వారి అనుమతితో ఈ పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి దశలో 858 కోట్లతో కార్యక్రమం చేపట్టామని, గతంలో ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ మొదటి ప్రాధాన్యతగా పనులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాళాల అభివృద్ధికి 633 కోట్లు, శివారు మునిసిపాలిటీలకు 225 కోట్లు కేటాయించామని, ఇక్కడ 68 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్‌ నాలా పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

https://ntvtelugu.com/minister-ktr-laid-the-foundation-stone-for-the-sndp-works/
Exit mobile version