NTV Telugu Site icon

నీలోఫర్‌లో ఘోరం…100 కోసం వార్డ్ బాయ్ దారుణం

హైదరాబాద్‌ నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం వార్డుబాయ్ ఘోరానికి ఒడిగట్టాడు. అతడి బాలుడి ప్రాణం తీశాడు వార్డ్ బాయ్. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలన్నారు.

బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అక్కడే మరో రోగి చికిత్స అందుకుంటున్నాడు. అతను వార్ బాయ్‌కి 100 రూపాయలు ఇచ్చాడు. దీంతో ఆజం కి వున్న ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి డబ్బులిచ్చిన రోగికి అమర్చాడు వార్డ్ బాయ్. బాలుడి ఆక్సిజన్ తీసివేసి మరొక పేషెంట్ గా అమర్చడంతో ఆక్సిజన్ అందక బాలుడు మృతిచెందాడు. బాలుడు ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీరియస్ అయ్యారు. బాలుడు మృతికి కారణమైన వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేశారు సూపరింటెండెంట్. వందరూపాయల కోసం ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.