NTV Telugu Site icon

దాదాకి కోహ్లీ కౌంటర్… కెప్టెన్ గా తప్పుకోవద్దని చెప్పలేదు..!

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మధ్య బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన తర్వాత గంగూలీ మాట్లాడుతూ… కోహ్లీ మొదట టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనే నేను తప్పుకోవద్దు అని చెప్పను. అయిన కోహ్లీ వినలేదు. దాంతో వైట్ బల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు వద్దు అని విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పిచింది అని దాదా పేర్కొన్నారు.

కానీ ఈరోజు విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ… కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని గంగూలీ నాకు చెప్పలేదు. కానీ… మీడియాతో గంగూలీ అలా చెప్పాడు అని అన్నారు. బీసీసీఐ నుంచి ఇలాంటి వైఖరి ఊహించలేదు అని చెప్పిన కోహ్లీ… కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపిక సరైందే అని ప్రకటించాడు.